- అభిషేక్ యాదవ్ కి ఘన సన్మానం.
- ఉత్తరప్రదేశ్ నుంచి భారతదేశానికి సైకిల్ యాత్ర.
- నేటి యాదవ యువతకు ఆదర్శం యువకుడి సైకిల్ యాత్ర.
- మన్యం న్యూస్ బూర్గంపహాడ్:-అహిర్ రెజిమెంట్లో యాదవుల కుల రిజర్వేషన్ ను తొలగించినందుకు గాను సైకిల్ యాత్ర చేస్తున్న అభిషేక్ యాదవ్ సైకిల్ యాత్ర ఆదివారం బూర్గంపహాడ్ కి చేరుకుంది.అహిర్ రెజిమెంట్లో యాదవులకు రిజర్వేషన్ కల్పించాలనే ఏకైక సంకల్పంతో ఉత్తరప్రదేశ్ నుంచి భారతదేశానికి సైకిల్ యాత్ర చేస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ కి చెందిన వాసి అభిషేక్ యాదవ్ ను ఆదివారం బూర్గంపహాడ్ మండల కేంద్రంలో అఖిల భారత యాదవ మహాసభ తరపున ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర నాయకులు డేగల రాజు యాదవ్,జిల్లా యూత్ అధ్యక్షులు గొడపర్తి రాంబాబు,గంగరాజు యాదవ్,జిల్లా యూత్ ఉపాధ్యక్షులు కందుల రాము,ప్రచార కార్యదర్శి నరేష్,అఖిల భారత యాదవ మహాసభ మండల ప్రధాన కార్యదర్శి డేగల ధర్మయ్య యాదవ్,యూత్ నాయకులు హరీష్,మోహన్,నవీన్,రవి,మర్లపాటి రాజు,కోటేశ్వరావు తో పాటు బూర్గంపహాడ్ పుల్లారెడ్డి స్వీట్స్ తో పిలువబడే స్వీట్ షాపు దిలీప్ కుమార్ తదితరులు పాల్గొనీ,ఈ యాత్ర చేస్తున్నటువంటి అభిషేక్ యాదవ్ కి కొంత నగదు రూపంలో సహాయం అందించారు.





