- కాంగ్రెస్ పార్టీతోనే అన్నివర్గాల ప్రజలకు సంక్షేమం
- చివరిరోజు 19వ వార్డులో జరిగిన గడపగడపకూ కాంగ్రెస్ పార్టీప్రచారంలో జెడ్పీచైర్మన్ కోరం
మన్యం న్యూస్,ఇల్లందు: టీపీసీసీ కమిటీ ఆదేశాల మేరకు చేపట్టిన గడపగడపకూ కాంగ్రెస్ ప్రచారం చివరిరోజు మున్సిపాలిటీలోని 19వ వార్డులో ఆదివారం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య 19వవార్డు నందు ఇంటింటికీ కాంగ్రెస్ పార్టీప్రచారం విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయేరోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రం, రాష్ట్రంలో అధికారం చేపట్టడం తధ్యమని, కాంగ్రెస్ ప్రకటించిన ప్రజామోద మేనిఫెస్టోను నూటికి నూరుశాతం అమలుచేస్తుందని ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కనకయ్య కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మాజీ మున్సిపల్ ఛైర్మెన్ ఎదల్లపల్లి అనసూర్య, పట్టణ అధ్యక్షుడు దొడ్డా డానియేలు, 19వ వార్డు కౌన్సిలర్ పత్తి స్వప్న, నాయకులు భద్రం, వాసుదేవ్, బొల్లి రామారావు, పత్తి రంజిత్, వెంకటనారాయణ, చిల్లా శ్రీను, రావూరి సతీష్, ఇమామ్, నీలపు రమేష్, ఈసం లక్ష్మణ్, కుక్కల వెంకటేశ్వర్లు, మడుగు సాంబమూర్తి, బోళ్ళ సూర్యం, కౌశిక్, అజ్జూ, మహిళా నాయకురాళ్ళు స్వరూప, నిర్మల, బానోత్ శారద, సరస్వతి, మధారమ్మ, సర్పంచులు పాయంలలిత, కల్తీ పద్మ, పాయం స్వాతి, ఎంపీటీసీలు మండల రాము, పూనెం సురేందర్, పాయం కృష్ణప్రసాద్, తాటి బిక్షం తదితరులు పాల్గొన్నారు.





