మన్యం న్యూస్: జూలూరుపాడు, సెప్టెంబర్ 03, మండల పరిధిలోని గుండెపుడి గ్రామంలో గ్రామ దేవతలైన ముత్యాలమ్మ తల్లి, బొడ్రాయి (నాబిశిల) కి భక్తి శ్రద్ధలతోటి గ్రామస్తులంతా 108 బిందెల నీళ్లతో ఆదివారం జలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని మహిళలంతా మేళ్ళ తాళ్ళల తో ఊరేగింపు గా వెళ్లి బోనాలు సమర్పించి ముక్కులు తీర్చుకున్నారు. పంటలు బాగా పండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని, గ్రామస్తులంతా ఆయురారోగ్యాలతో ఉండాలని గ్రామదేవతలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తూము కోటయ్య, గ్రామ సర్పంచ్ భానోత్ నరసింహరావు, పొన్నెకంటి వెంకటయ్య, దుద్దుకురి సుమంత్, వేల్పుల గోపాలకృష్ణ, కళ్యాణపు నరేష్, కంచర్ల శేఖర్, దొప్ప సత్యం, గోగుల వెంకటేశ్వర్లు, యల్లంకి తిరుపతిరావు, దుద్దుకూరి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.





