జలగోస తీర్చిన భగీరదుడు కేసీఆర్.
ఇంటింటా అభివృద్ధి ప్రచారంలో దోసిట భగీరథ నీరు త్రాగుతున్న ఫ్యాక్స్ చైర్మన్ బిక్కసాని.
మన్యం న్యూస్, బూర్గంపహాడ్: మండల పరిధిలోని సారపాక పట్టణంలో సీఎం కేసీఆర్ దిశా నిర్దేశంతో రూపొందిన రాష్ట్ర అభివృద్ధి పథకాల విజయగాధను ఇంటింటికి బీ. ఆర్.ఎస్ ప్రచారంలో బాగంగా ఆదివారం మండల టిఆర్ఎస్ నాయకులు విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా ప్రచారంలో పాల్గొన్న ప్రజాప్రతినిధి పిఏసిఎఎస్ చైర్మెన్ బిక్కసాని శ్రీనివాస్ వాడల్లో తిరుగుతూ అలసిపోయిన క్రమంలో కెసిఆర్ భగీరథ నీరు దోసిట పట్టి త్రాగారు .ఈ సందర్భంగా చుట్టూ ప్రక్కల ప్రజలతో బిక్కసాని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకని దుస్థితి ఆ నాటి పరిస్థితి అని,కోన్ని గ్రామాల్లో ఆడబిడ్డలు కిలోమీటర్ల దూరం నడిచి తెచ్చిన బిందెడు నీటితో ఇంటిల్లిపాదీ గొంతు తడుపుకోవాల్సిన దుస్థితి ఆనాటి పరిస్థితి అని,కలుషిత నీటితో రోగాలపాలైన దయనీయ స్థితి ఆనాటి రోజుకు అని,అపర భగీరథడు ముఖ్యమంత్రి కేసీఆర్,మది నుంచి ఉద్భవించిన ‘మిషన్ భగీరథ పథకం’ జల గోసకు శాశ్వత పరిష్కారం చూపిందనీ,ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా రక్షిత మంచినీరు అందిస్తూ ఏండ్ల నాటి కష్టాలను కడతేర్చిందనీ,ఆడబిడ్డలకు కిలోమీటర్ల కొద్దీ నడిచే బాధ తప్పడమే కాదు,ఇంటిల్లిపాది ఆరోగ్యం బాగు పడిందనీ ఆయన మాట్లాడుతూ ప్రజల్లో మరో మారు చైతన్యం తీసుకువచ్చారు.





