ఎమ్మెల్యే రేగా హ్యాట్రిక్ విజయం ఖాయం
*పినపాక నియోజకవర్గ బిఆర్ఎస్ కన్వీనర్ నవీన్ బాబు
మన్యం న్యూస్,మణుగూరు: రానున్న ఎన్నికల్లో పినపాక నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావు హ్యాట్రిక్ విజయం ఖాయమని పినపాక నియోజకవర్గ బిఆర్ఎస్ కన్వీనర్ నవీన్ బాబు అన్నారు. ఆయన సోమవారం విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు
మండలంలోని ముత్యాలమ్మ నగర్ గ్రామ ప్రజలకుసీఎం కెసిఆర్ పల్లె ప్రగతి , గడపగడపకు తెలంగాణ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులను ప్రజలకు నవీన్ బాబు వివరించారు. ఈ కార్యక్రమంలో కూనవరం సర్పంచ్ ఏనుక ప్రసాద్, బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని బాబురావు,కూనవరం బీసీ సెల్ అధ్యక్షులు నాగేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ వల్లభనేని రమణ, మాదారు హుస్సేన్ ,కుదుస్ హుస్సేన్ , మల్లేష్ , సూర్యం బీ ఆర్ ఎస్ నాయకులు పార్టీ నాయకులు, రేగా, నవీన్ బాబు యువ సైన్యం పాల్గొన్నారు.





