బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారావు
మన్యం న్యూస్ గుండాల, ఆళ్లపల్లి: ప్రభుత్వ విప్ ,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ఆళ్లపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు అన్నారు. సోమవారం మండలం పరిధిలోని రామాంజి గూడెం, చెలగట్టు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ కరపత్రాలను ఇంటింటికీ తిరుగుతూ పంపిణీ చేశారు. ఇప్పటివరకు రేగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్తులకు వివరించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రేగా కాంతారావే అఖండ మెజార్టీతో గెలుపొందుతారని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నానీ ఆయనకు అండగా నిలవలసిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హనుమంతరావు, సర్పంచ్ నిర్మల, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాంబాబు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు





