మన్యం న్యూస్, నూగురు వెంకటాపురం:
మండలం కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో టేకుల బోరు గ్రామస్తులకు ఇంటి స్థలాలు కేటాయించాలని తాసిల్దార్ కి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కుమ్మరి శీను వినతిపత్రం అందజేశారు. ప్రతి ఏటా వరద ముంపుకు గురవుతున్న టేకుల బోరు గ్రామ ప్రజలకు డబల్ బెడ్ రూమ్ ఇళ్ళను కేటాయించి వారిని ఆదుకోవాలని.
ఐ టి డి ఏ పి ఓ , తహసిల్దార్ కి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కుమ్మరి శ్రీను అందజేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు కట్ట నరసింహ చారి, సమ్మక్క, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.





