మన్యం న్యూస్ కరకగూడెం:కరకగూడెం పరిధిలోని ప్రభుత్వ వైద్యశాలలో వైద్యాధికారి డాక్టర్ దుర్గా. నరేష్ ఆధ్వర్యంలో ఆర్ఎంపి ,పిఎంపి గ్రామీణ వైద్యులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీపీ రేగా కాళికా,ఎస్ఐ రాజారామ్ పాల్గొని మాట్లాడారు. గ్రామీణ వైద్యులైన ఆర్ఎంపి పిఎంపి లు తమ పరిధి దాటి వైద్యం నిర్వహించకూడదని, పరిధికి లోబడి వైద్యం నిర్వహించాలని, ఎప్పటికీ అప్పుడు ప్రభుత్వ వైద్యాధికారులకు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. ఆర్ఎంపీ ,పిఎంపి గ్రామీణ వైద్యులు పరిమితులకు లోబడి పనిచేయాలని పరిధికి మించి వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.అలాగే డాక్టర్ దుర్గా నరేష్ మాట్లాడుతూ ప్రతి ఆర్ఎంపి, పిఎంపి క్లినిక్ లలో సీసీ కెమెరా ఉండాలని, ఎవరెవరైతే మీ దగ్గరికి వస్తున్నారా వారి యొక్క పూర్తి అడ్రస్ రోజు వారీగా రాసి ప్రభుత్వ వైద్య సిబ్బందికి తెలియజేయాలని సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అర్ఎంపి,పిఎంపి లు పాల్గొన్నారు.
