UPDATES  

 ఓటుహక్కు కల్పనకు స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలి * జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
అర్హులైన యువతీ, యువకులకు ఓటుహక్కు కల్పనకు పెద్ద ఎత్తున స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. సోమవారం ఐడిఓసి కార్యాలయం నుండి స్వీప్ కార్యక్రమాలు నిర్వహణ, గృహలక్ష్మి పథక దరఖాస్తులు విచారణ, జిఓ నెం. 76 తదితర అంశాలపై తహసిల్దార్లతో వీడియో కాన్ఫరెన్సు
నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండే యువతను లక్ష్యంగా చేసుకుని కళాశాలల్లో పెద్ద ఎత్తున స్వీప్ కార్యక్రమాలు
చేపట్టాలని చెప్పారు. తహసిల్దార్లు స్వీప్ కార్యక్రమాలు నిర్వహణకు కార్యాచణ నివేదికలు సిద్ధం చేయాలని చెప్పారు.
అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు పొందకుండా ఉండటానికి వీల్లేదని, మాస్ క్యాంపెయిన్లు నిర్వహిస్తూ రానున్న
వారం రోజుల్లో నమోదులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గృహాలక్ష్మి పథకానికి వచ్చిన దరఖాస్తులు విచారణ ప్రక్రియ గుర్తించి ప్రస్తావిస్తూ విచారణ
టీములు ప్రతి దరఖాస్తుదారుని ఇంటికెళ్లి విచారణ చేపట్టాలని చెప్పారు. విచారణ పూర్తయిన దరఖాస్తులపై ప్రతి రోజు నివేదికలు అందచేయాలని ఆదేశించారు. అంతర్జాల, సెల్ఫోన్ సేవలు కొరకు సెల్
టవర్లు నిర్మాణం ప్రక్రియ చేపట్టాలని చెప్పారు. జిల్లాలోని జూలూరుపాడు, ముల్కలపల్లి, చర్ల, దుమ్ముగూడెం, గుండాల మండలాల్లో సెల్ టవర్లు నిర్మించాల్సి ఉందని, టవర్లు నిర్మాణానికి అవసరమైన స్థల సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని తహసిల్దారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీఓలు శిరీష, మంగిలాల్, ఎన్నికల విభాగం తహసిల్దార్ ప్రసాద్, అన్ని మండలాల తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !