మన్యం న్యూస్, బూర్గంపహాడ్: మండల పరిధి సారపాక గ్రామపంచాయతీ గాంధీనగర్ లో నివాసం ఉంటున్న పున్నం రాజయ్య(55) మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న బీ అర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణా రెడ్డి సోమవారం మృతుడు రాజయ్య నివాసానికి వెళ్లి రాజయ్య భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది. మృతుని కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో మండల బి.ఆర్.ఎస్ పార్టీ మైనార్టీ ప్రధాన కార్యదర్శి గుల్ మహ్మద్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎర్ర శ్రీను,మిరియాల రామారావు,కోటమర్తి.వెంకటేశ్వర్లు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,గ్రామ పెద్దలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
