UPDATES  

 గొల్ల కురుమల ఆర్థిక, సామాజికాభివృద్ధి సాధనకే గొర్రెల పంపిణీ : ఎమ్మెల్యే రేగా

గొల్ల కురుమల ఆర్థిక, సామాజికాభివృద్ధి సాధనకే గొర్రెల పంపిణీ : ఎమ్మెల్యే రేగా

*రెండో విడత గొర్రెల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేగా కాంతారావు
మన్యం న్యూస్,అశ్వాపురం:
మండలం లోని ఆనందపురం గ్రామంలో పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరై పాల్గొన్నారు. ఎమ్మెల్యే రేగా చేతుల మీదుగా 6మంది లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్ల కురుమల సంక్షేమ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించిందని, వారికోసం మేకలు గొర్లు సబ్సిడీ పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అన్నారు. గొల్ల కురుమల సంక్షేమం కోసం ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేసి వారి అభివృద్ధికి బాటలు వేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పశుసంవర్ధక శాఖ అధికారులు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !