మన్యం న్యూస్, అశ్వాపురం: మండల లో బుడుగుబజారుకు చెందిన ఎస్ .కుమారి కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన రూ28 వేల విలువ గల సీఎం సహాయనిధి చెక్కు మంజూరైనది.సోమవారం మండల పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు లబ్ధి దారురాలు కుమారికి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల బి ఆర్ ఎస్ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
