అభివృద్ధి సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ప్రభుత్వానికి శ్రీరామరక్ష.
* ఎమ్మెల్యే రేగా కాంతారావు హ్యాట్రిక్ విజయం ఖాయం
* ఇంటింటి కి బీఆర్ఎస్ ప్రచారంలో జడ్పిటిసి సుభద్ర దేవి, దాట్ల వాసుబాబు
మన్యం న్యూస్,పినపాక:అభివృద్ధి సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ప్రభుత్వానికి శ్రీరామరక్ష అని జెడ్పిటిసి దాట్ల సుభద్ర దేవి వాసు బాబు అన్నారు. సోమవారం బీఆర్‌ఎస్ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి టి.కొత్తగూడెం గ్రామంలో ఇంటింటి బీఆర్ఎస్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి మాట్లాడారు.
పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే బీఆర్‌ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ను ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై విడుదల చేసిన కరపత్రాన్ని అందజేశారు.బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాట్ల వాసుబాబు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందని కుటుంబం అంటూ లేదని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో సైతం ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మూడోసారి ఎమ్మెల్యేగా గెలవడం తద్యమన్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతర ప్రతిపక్ష నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీఆర్ఎస్, విప్ రేగా విజయాన్ని ఆపలేరన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకపోతున్న కాంగ్రెస్ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.దేశంలో ఎక్కడా లేని అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని తెలిపారు. బీఆర్‌ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో అన్నివర్గాల ప్రజలకు లబ్ధి చేకూరిందని స్పష్టంచేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేసిందని చెప్పారు. బీఆర్‌ఎస్ పథకాలే తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఉనికి కోసం పాకులాడుతోందని ఎద్దేవాచేశారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ మూడవ సారి బీఆర్‌ఎస్ జెండా ఎగరవేయడం ఖాయం అన్నారు. గడపగడపకు బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.
