తెలంగాణ సమాజానికి ఉద్యమ ఫలాలు అందుతున్నాయి
*నాడు కేసిఆర్ కలలు కన్నా తెలంగాణ ఆవిష్కృతమైంది
* సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రేగా హ్యాట్రిక్ విజయం పక్క
* పినపాక డబుల్ అభివృద్ధి రేగా కాంతారావు తోనే సాధ్యం
* ఉద్యమకారులు, బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు పొడియం నరేందర్ కుమార్
మన్యం న్యూస్,బూర్గంపాడు: ఉమ్మడి ఆంధ్రాలో గోసపడ్డ తెలంగాణ వాసులు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి సాధించి నేడు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఉద్యమకారులు, బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు పొడియం నరేందర్ కుమార్ అన్నారు. ఆయన సోమవారం మండల పరిధి ముసలి మడుగు గ్రామంలో ఇంటింటికి కేసీఆర్ కరపత్రాలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికలలో సీఎం కెసిఆర్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు హ్యాట్రిక్ విజయం సాధిస్తారని అన్నారు. ఇనపాక డబుల్ అభివృద్ధి జరగాలంటే కేవలం ఎమ్మెల్యే రేగాకాంతరావుకే సాధ్యమవుతుందని అన్నారు. బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
