* ప్రచారంలో దూసుకుపోతున్న పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ
* రేగాని మరల గెలిపిద్దాం.. డబల్ అభివృద్ధి సాధిద్దాం
* విస్తృత ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు
* ఆదరణను చూసి కంగు తింటున్న ప్రతిపక్ష పార్టీలు
మన్యం న్యూస్ విలేకరులు:
పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా గడప గడపకు సీఎం కేసీఆర్ కార్యక్రమం గత కొద్దిరోజుల నుండి జోరుగా కొనసాగుతోంది. మంగళవారం సైతం పినపాక,మణుగూరు,అశ్వాపురం మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు కార్యకర్తలు, మహిళా విభాగం, సోషల్ మీడియా సభ్యులు ఉత్సాహంగా పాల్గొని సీఎం కేసీఆర్ పథకాలు గడపగడపకు వివరిస్తున్నారు. అలాగే పినపాక నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత ,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పినపాక నియోజకవర్గం లో ఆయా గ్రామాలలో చేపట్టిన రూ.వేలకోట్ల అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడం జరుగుతుంది. రేగా కాంతారావు హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముమ్మర ప్రచారం చేపట్టారు.
