మన్యం న్యూస్ గుండాల:మండలంలోని మీ సేవ కేంద్రాల నిర్వాహకుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం మీసేవ నిర్వాహకుల ఆధ్వర్యంలో తహశీల్దార్ రంగ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీసేవ నిర్వాహకులు జగన్ మాట్లాడుతూ నిర్వాహకులకు గత కొన్ని సంవత్సరాలుగా మీ సేవ కమీషన్లు పెంచడం జరగలేదని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీ సేవ నిర్వహణ అనేది చాలా కష్టంగా ఉన్నదని వాపోయారు. కరెంట్ బిల్లులు, ఇంటర్నెట్ ఛార్జీలు, రూమ్ రెంట్లు కట్టలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వం నుండి స్పందన లేదన్నారు. ఈ కార్యక్రమంలో గుండాల మండల మీ సేవ నిర్వాహకులు వాంకుడోతురాము, ఇర్ప కిశోర్ పాల్గొన్నారు.
