ఉత్తమ పౌరులను తయారు చేయటంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం *ఉపాధ్యాయులకు సన్మానం
*ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి అంకిత్.
మన్యం న్యూస్ ఏటూరు నాగారం సమాజానికి ఉత్తమ పౌరులను అందించడం తో పాటు వారిలో జ్ఞాన జ్యోతిని వెలిగిస్తూ ఉన్నత శిఖరాల వైపు పయనించేలా చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి అంకిత్ ఐఏఎస్ అన్నారు.ఉపాధ్యాయ దినోత్సవం మంగళవారం ఐటీడీఏ సమావేశం మందిరంలోని వేడుకలలో ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని ప్రారంభించి ఉపరాష్ట్రపతిగా ఉన్నత శిఖరాలను అధిరోహించి ఉపాధ్యాయ లోకానికి స్ఫూర్తి గా నిలిచిన డాక్టర్. సర్వేపల్లి రాధాకృష్ణను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తో గత సంవత్సరం 10 ఫలితాలలో మంచి ఫలితాలు సాధించారని విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ఈ ఏడాది సైతం పదవ తరగతి పరీక్షల్లో 10/10 ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 165 మంది ఉత్తమ ఉపాధ్యాయులను పూలమాలవేసి షీల్డ్ అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.అనంతరం కొమరం భీమ్ ఆదివాసి వీరుడి కథ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తెలుసుకోవడం కోసం కొమరం భీమ్ చరిత్ర పుస్తకాలు ముద్రించి ఉపాధ్యాయుల ద్వారా ఆయా పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో డిడి పోచం,ఏసీఎంవో కోడి రవీందర్,ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ఆశ్రమ పాఠశాలలు,గురుకుల పాఠశాల కళాశాలలో ఉత్తమ ఉపాధ్యాయులు
తదితరులు పాల్గొన్నారు.
