శ్రీనగర్ లో అభివృద్ధి పనులు జరిపించండి
* జిల్లా కలెక్టర్ కు లగడపాటి విన్నపం
మన్యం న్యూస్ కొత్తగూడెం టౌన్:
లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ గ్రామ పంచాయతీలో నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు అభివృద్ధి పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని
శ్రీనగర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ లగడపాటి రమేష్ మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రియాంకకు విజ్ఞప్తి చేయడం జరిగింది. సీఎం కేసీఆర్ మంజూరు చేసిన 50 లక్షల విషయాన్ని కలెక్టర్ కు తెలిపి అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాల కాపీని అందజేశారు. కార్యక్రమంలో లక్ష్మీదేవిపల్లి రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శ్రీనగర్ వార్డు సభ్యులు వట్టి కొండ సాంబశివరావు పాల్గొన్నారు.