గురువును మించిన దైవం లేదు. *నడక, నడవడిక నేర్పుతూ జ్ఞానాన్ని అందించే సామర్థ్యం ఒక్క గురువుకే ఉంది
* ఏడూళ్ల బయ్యారం ఎస్సై నాగుల్ మీరా ఖాన్
*ఎక్సలెంట్ భాషా హైస్కూల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
మన్యం న్యూస్ ,పినపాక, (సెప్టెంబర్ 5):గురువును మించిన దైవం లేదు.నడక, నడవడిక నేర్పుతూ జ్ఞానాన్ని అందించే సామర్థ్యం ఒక్క గురువుకే ఉంది అని
ఏడూళ్ల బయ్యారం ఎస్సై నాగుల్ మీరా ఖాన్ అన్నారు.
మండల పరిధి ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డు లో ఎక్సెలెంట్ బాషా హై స్కూల్ లో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా స్థానిక ఎస్సై నాగుల్ మీరా ఖాన్ హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై నాగుల్ మీరా మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మార్గదర్శకుడైన ఉపాధ్యాయుడు ఉంటారని, ఎంత గొప్ప స్థానంలో ఉన్న వారి వెనక ఉపాధ్యాయుల కృషి ఉంటుందని పేర్కొన్నారు. తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు మనకు దైవంతో సమానమని చెప్పారు.
ఈ కార్యక్రమం లో ఎక్సెలెంట్ గ్రూప్ అఫ్ స్కూల్స్ డైరెక్టర్స్ ఎండీ ఖాదర్, ఎండీ యూసుఫ్ షరీఫ్, ఎండీ యాకుబ్ షరీఫ్,ముక్కు వెంకట నర్సారెడ్డి,బండారు నరేంద్ర, ప్రిన్సిపాల్ అంకం సురేష్, సీనియర్ ఉపాధ్యాయురాలు వలసలా మెహన్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు