మన్యం న్యూస్ చండ్రుగొండ సెప్టెంబర్ 05 : అశ్వరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మంగళవారం మండల పర్యటనలో భాగంగా తమను ముందస్తుగా అరెస్ట్ చేయడం హేయమైన చర్యని బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు ఇనుముల పిచ్చయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం ఏజెన్సీ మండలాల్లో అన్ని వర్గాల అర్హత ఉన్న నిరుపేదలకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ముందస్తు అరెస్టు అయిన వారిలో కుక్కముడి చంటి, చాపలమడుగు గణేష్, చాపలమడుగు నవీన్ ఉన్నారు.