ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
సమాజానికి దిక్సూచి గురువు:ఇల్లందు మున్సిపల్ చైర్మన్ డీవీ
మన్యం న్యూస్,ఇల్లందు ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని మార్గదర్శిని గ్రూప్ ఆఫ్ స్కూల్స్, సాహితీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేసే ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అనంతరం డీవీ మాట్లాడుతూ..ప్రతి సంవత్సరం సెప్టెంబరు 5న జాతీయ దేశంలోని యువతరానికి విద్యను అందించడానికి, మార్గనిర్దేశం చేయడానికి ఉపాధ్యాయులు అంకితభావంతో కృషిచేసినందుకు ఉపాధ్యాయులను గౌరవించేందుకు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. భావితరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయులను సన్మానించుకోవడం గొప్ప విషయం అన్నారు. సమాజానికి చూసి గురువే అని అన్నారు .ఈ కార్యక్రమంలో మార్గదర్శిని విద్యాసంస్థ డైరెక్టర్లు రాంబాబు, అర్వపల్లి రాధాకృష్ణ, సాహితి డిగ్రీకాలేజ్ ప్రిన్సిపల్ దామోదర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.