సంక్షేమ పాలనే సీఎంకేసిఆర్ ధ్యేయం
రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు
పేదింటి ఆడబిడ్డలకు వరం కళ్యాణ లక్ష్మి
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన: ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం న్యూస్ ,అశ్వాపురం: మండలం కేంద్రంలో ని రైతు వేదిక లో మంగళవారం కళ్యాణ లక్ష్మి షాదీ ,ముబారక్ పథకాలకు సంభవించింది20 మంది లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన 20 లక్షల 2320 రూపాయల విలువగల చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు బిఆర్ఎస్ సర్కార్ ఆర్థిక భరోసా ఇస్తున్నదని అన్నారు, రాష్ట్రలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. నిరుపేద తల్లిదండ్రులు ఆడపిల్లల పెండ్లికి ఇబ్బంది పడొద్దునే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు.వచ్చే ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సూదిరెడ్డి సులక్షణ రెడ్డి, వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,స్థానిక సర్పంచు బానోత్ శారద, మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, మల్లెమడుగు సర్పంచ్ కోడి కృష్ణవేణి, నెల్లిపాక బంజర సర్పంచ్ గుర్రము వెంకటరమణ ,ఉప సర్పంచ్ మేడవరపు సుధీర్,భూక్య చందులాల్ ,ఎమ్మార్వో రమాదేవి,ఆర్ ఐ నాగమణి,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్,నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్,మండల నాయకులు కందుల కృష్ణార్జున ,గజ్జల లక్ష్మారెడ్డి,బానోత్ సదరులాల్,చిలక వెంకటరామయ్య,యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ,మిట్టకంటి సురేందర్ రెడ్డి,వల్లపు కృష్ణ జూపల్లికిరణ్,రావుల అజయ్,కాలవ సంసోను, వల్లిపోగు రాము,మేకల భాస్కర్,పిట్ట శ్రీను,రామకృష్ణ,రమేష్,లోహిత్,పవన్,మండల్ నాయకులు ,యువజన నాయకులు కార్యకర్తలు అభిమానులు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు అశ్వాపురం మండల ప్రజాప్రతినిధులు, అధికారులు పలువురు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.