- పేదల శ్రేయస్సు కోసమే సంక్షేమ పథకాలు. రేగా
- నిరుపేద కుటుంబాలకు బిఆర్ఎస్ సర్కార్ ఆర్థిక భరోసా.
- రాజకీయాలకతీతంగా అభివృద్ధి పథకాలు.
- పేదింటి ఆడబిడ్డలకు కానుక కెసీఆర్ కానుక.
- కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్.
- తెలంగాణ రక్షకుడు ముఖ్యమంత్రి కెసిఆర్.
మన్యం న్యూస్ ,బూర్గంపహాడ్: సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్నో పథకాలతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారని,ఈ సారి హ్యాట్రిక్ విజయం తధ్యం అని విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో మంగళవారం కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.మండలానికి చెందిన 40 మంది లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన సుమారు రు.40లక్షల పై చిలుకు విలువగల చెక్కులను పంపిణీ చేశారు .రానున్న ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు.తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని,మూడోసారి కెసిఆర్ నీ ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పని చేస్తాననీ,రైతులు ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత,తహశీల్దార్ రాజారావు,ఆర్ఐ లు ముత్తయ్య,నర్సింహారావు,బూర్గంపహాడ్ గ్రామ సర్పంచ్ సిరిపురం స్వప్న, నాగీనేని ప్రోలు సర్పంచ్ భుక్య శ్రావణి అదేవిధంగా స్వసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాస్,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,మండల యూత్ ప్రెసిడెంట్ గొనెల నాని, ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లురుపల్లి వంశీ,బూర్గంపహాడ్ బిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రసిడెంట్ సోహెల్ పాషా,ఎస్సి సెల్ టౌన్ అధ్యక్షులు మందా ప్రసాద్,మైనార్టీ మండల అధ్యక్షులు సాదిక్ పాషా,మండల ముఖ్య నాయకులు తోకల సతీష్,గంగరాజు యాదవ్,కొనకంచి శ్రీను,చుక్కప్లలి బాలాజీ,చలకోటి పూర్ణ,చైతన్య రెడ్డి తో పాటు పలువురు ముఖ్య నాయకులు,ఎంపీటీసీలు,సర్పంచ్ లు,ఉప సర్పంచులు,మండల బిఆర్ఎస్ నాయకులు,అనుబంధ సంఘ నాయకులు,ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ,యువజన,మహిళా నాయకులు,అభిమానులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.