మన్యం న్యూస్: జూలూరుపాడు, సెప్టెంబర్ 06, జూలూరుపాడు, ఏన్కూరు మండలల సరిహద్దు ప్రాంతంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని బొలెరో ట్రక్ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై పయనిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. చనిపోయిన యువకులు సుజాతనగర్ మండలం వేపలగడ్డ, నాయకులగూడెం గ్రామాలకు చెందిన పోనేం వంశీ (28) మోడియం సాంబయ్య (23) గా భావిస్తున్నారు. ఈ విషయంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.