మన్యం న్యూస్ కరకగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో మొదటి రోజు బిఅర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు అక్కిరెడ్డి వెంకటరెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి ఇంటింటికి కరపత్రాలు పట్టుకొని ప్రభుత్వ పథకాలను వివరించారు. అలాగే పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొగ్గలి నాగమణి ఉపసర్పంచ్ ఈసం. సమ్మయ్య, సోషల్ మీడియా మండల అధ్యక్షులు చిట్టిమల్ల ప్రవీణ్ నాయకులు కంగల. సారయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.
