సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించండి
* వర్కర్స్ యూనియన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
హైకోర్టు సూచనమేరకు అక్టోబర్ నెలలో సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కమిటి ఆర్గనైజింగ్ కార్యదర్శి జి.వీరస్వామి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం శేషగిరిభవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆపద్దర్మ గుర్తింపు సంఘమైన టిబిజికెఎస్, రాష్ట్ర ప్రభుత్వం వత్తిడితోనే సింగరేణి యాజమాన్యం గుర్తింపు ఎన్నికలను వాయదావేస్తోందని, ఉత్పత్తి, ఉత్పాదకతను సాకుగా చూపుతూ టిబిజికెఎస్ కాలపరిమితి తీరినప్పటికి ఎన్నికలు నిర్వహించకుండా కాలాయాపన చేస్తున్నారని ఆరోపించారు. కార్మికుల్లో విశ్వాసాన్ని కోల్పోయిన టిబిజికెఎస్, సింగరేణి యాజమాన్యం కార్మికుల కష్టార్జితాన్ని ప్రభుత్వానికి దోచి పెట్టేందుకే ఎన్నికల నిర్వహణకు అడ్డుపడుతున్నారని అన్నారు. ఈ నెల 11న డిప్యూటీ కేంద్ర కార్మిక శాఖ అధికారి సమక్షంలో జరిగే సమావేశంలో ఎన్నికల తేదీని ఖరారు చేసి తక్షణమే ఎన్నికల నిర్వహణ ప్రక్రియ చేపట్టాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోలనల నిర్వహిస్తామని, అవసరమైతే సమ్మె నోటీసు జారీ చేసి సమ్మెకు పూనుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో యూనియన్ కొత్తగూడెం కార్పోరేట్ బ్రాంచి కార్యదర్శులు వట్టికొండ మల్లికార్జున్‌రావు, ఎస్.రమణమూర్తి, నాయకులు కె.సోమయ్య తదితరులు పాల్గొన్నారు.