సీనియర్ భవన నిర్మాణ కార్మికుడు మల్లేష్ మృతి బాధాకరం
మన్యం న్యూస్, అశ్వాపురం:అశ్వాపురం మండలం మొండికుంట గ్రామం చెందిన సీనియర్ భవన నిర్మాణ కార్మికుడు పురము మల్లేష్ ఆకస్మికంగా మృతి చెందడం బాధాకరమని.
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు అన్నారు,బుధవారం ఉదయం అశ్వాపురం మండలం మొండికుంటలో పురము మల్లేష్ మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులను పరామర్శించి మృతుడి కుటుంబానికి,మొండికుంట భవన నిర్మాణ కార్మికుల సంఘం తరఫున 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు.ఈ కార్యక్రమంలో
మొండికుంట నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు చుంచు వీరాలు, మొండికుంట భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు సర్వ కృష్ణ,
మొండికుంట భవనిర్మాణ కార్మికుల సహాయ కార్యదర్శులు,
పశల ప్రభాకర్, చుంచు కొమరయ్య, దారపు శ్రీను, దేవేందర్, మరియు తదితరులు పాల్గొన్నారు.