మన్యం న్యూస్ గుండాల: తుడుం దెబ్బ రాష్ట్ర మాజీ కార్యదర్శి జవ్వాజి లక్ష్మీనారాయణ ఆశ సాధన కోసం పనిచేస్తామని తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంపిడి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో జవ్వాజి 5వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ తుడుం దెబ్బ ఎదుగుదల కోసం జవ్వాజి లక్ష్మీనారాయణ ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకులు వద్ద ఎర్రయ్య, పూనెం శ్రీను, జవ్వాజి జోషి, ఉప సర్పంచ్ ఉపేందర్, గ్రామస్తులు బొబ్బిలి రమేష్, నగేష్, ఆజాద్, పాష, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
