మన్యం న్యూస్, దుమ్ముగూడెం :
సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తున్నట్లు ఎస్సై గణేష్ తెలిపారు.దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకొన్న వారికి, పోలీసులు మొబైల్ను రికవరీ చేసి అప్పగించారు.సిఈఐఆర్ వెబ్సైటులోకి లాగిన్ అయిన వారు పోగొట్టుకున్న ఫోన్ల వివరాలు అప్లోడ్ చేయాగ,నూతనంగా అందుబాటులోకి వచ్చిన సీఈఐఆర్ సైట్ ద్వారా మొబైల్స్ను రికవరీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై గణేష్ మాట్లాడుతూ ప్రజలు ఎవరైనా తమ స్మార్ట్ ఫోన్‌లను పోగొట్టుకున్నట్లయితే వారు సీఈఐఆర్ సైట్ ద్వారా వెబ్ సైట్ లోకి వెళ్లి అందులో పూర్తి వివరాలు పొందపర్చాలని తద్వారా త్వరగా వారి మొబైలు ను పట్టుకోవడం జరుగుతుందన్నారు.ప్రజలు ఈ సీఈఐఆర్ అప్లికేషన్ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.