మన్యంన్యూస్,ఇల్లందు: ఏఐటియుసి అనుబంధ సింగరేణి కాలరిస్ వర్కర్స్ యూనియన్ ఆద్వర్యంలో ఇల్లందు జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట పదకొండవ వేజ్ బోర్డు ఏరియర్స్ సింగరేణి కార్మికులకు చెల్లించని కారణంగా బుధవారం ధర్నా నిర్వహించి ఇంచార్జి జనరల్ మేనేజర్ మల్లారపు మల్లయ్యకు వినతిపత్రం అందజేశారు. అనంతరం జరిగిన సభలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య, బ్రాంచి కార్యదర్శి ఎండి నజీర్ అహ్మద్ లు మాట్లాడుతూ..ప్రధానంగా
సింగరేణి కార్మికులకు రావలసిన
పదకొండవ వేజ్ బోర్డు ఏరియర్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచి సహయ కార్యదర్శులు కొంగర వేంకటేశ్వర్లు, గడదాసు నాగేశ్వరరావు, క్లర్క్ల్ స్టాఫ్ నాయకులు షేక్ ముస్తఫా, వీరన్న, బ్రాంచి ఆర్గనైజింగ్ కార్యదర్శి కొరిమి సుందర్, టిజేఎస్ జిల్లా ఉపాద్యక్షులు గుగులోత్ కృష్ణ, ఫిట్ కార్యదర్శులు మంచాల వేంకటేశ్వర్లు, సంజీవచారి, నూనె శ్రీనివాస్, బంధం నాగయ్య, ఉడత ఐలయ్య, వలి, శంశుద్దీన్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
