మన్యం న్యూస్, నూగురు వెంకటాపురం:
మండల పరిధి నూగురు గ్రామపంచాయతీ పల్లె దవాఖానలో చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఏదిర ప్రభుత్వ వైద్యురాలు భవ్యశ్రీ గర్భిణి స్త్రీల కొరకుబుధవారం ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో డాక్టర్ భవ్యశ్రీ గర్భిణీ స్త్రీలు ప్రెగ్నెన్సీ మరియు డెలివరీ సమయంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు.ప్రతి గర్భిణీ స తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. అనంతరం
చేయూత ఫౌండేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ డెలివరీ సమయంలో ఎవరికైనా బ్లడ్ అవసరం పడితే తమకు ముందుగా సమాచారం ఇవ్వాలని, తమ చేయూత ఫౌండేషన్ ద్వారా గర్భిణీ స్త్రీలకు తమవంతు సహాయం చేస్తామని అన్నారు.అనంతరం గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చేయూత ఫౌండేషన్ అధ్యక్షుడు చిడెం సాయి ప్రకాష్ సాయి తేజ పంజ శశి కుమార్ ,ఏడుకొండలు ,కొప్పుల వినోద్ ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
