మన్యం న్యూస్, పినపాక:మండలంలోని గోపాలరావుపేట గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి పురస్కరించుకుని శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని యాదవులు కుటుంబసమేతంగా వారి కుల దైవమైన శ్రీ కృష్ణుడి పూజించారు. జన్మదిన వేడుకల్లో పాల్గొని సాంప్రదాయాల ప్రకారం శ్రీకృష్ణుడికి పూజలు నిర్వహించి ఫలహారాలు పంచారు. మహిళలు ఉట్టి కొట్టు కార్యక్రమంలో పాల్గొని సంబరాలు చేశారు. యువకులు స్తంభం ఎక్కే కార్యక్రమాలు చేసి సంబరాల్లో మునిగిపోయారు. చిన్నపిల్లలకి కృష్ణుడి, గోపికల వేషధారణ లో చుడముచ్చటగల ప్రదర్శనలిచ్చి అందరిని ఆకట్టుకున్నారు . ఈ కార్యక్రమంలో కుల పెద్దలు ఊడుగుల ఐలయ్య, ఊడుగుల శ్రీశైలం, గాడుదుల కృష్ణ, బండ గొర్ల మల్లేష్,ఊడుగుల మధు, బండ గొర్ల సంతోష్, బొల్లు మహేందర్, బండ గొర్ల అశోక్, సంపత్, వెంకన్న, గంగరబోయినకృష్ణ, గ్రామ యువకులు,తదితరులు పాల్గొన్నారు.
