UPDATES  

 రూపురేఖలు మారనున్న గుండాల ఏజెన్సీ

రూపురేఖలు మారనున్న గుండాల ఏజెన్సీ
* మండలం అభివృద్ధి కొరకు ప్రత్యేక ఫోకస్
* ప్రజలకు మరిన్ని సౌకర్యాలు సేవలు
* దీంతో తీరనున్న కష్టాలు ప్రజల్లో ఆనందం
* నీతి ఆయోగ్ యాస్పిరేషనల్ బ్లాకుగా ఎంపిక
* నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశం

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఇక మరింత గుండాల మండలం రూప రేఖలు మారబోతున్నాయి.. ఇప్పటికే ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం విద్య వైద్యంతో పాటు అభివృద్ధి సంక్షేమం ఏజెన్సీ ప్రాంత పట్టణ ప్రాంత వాసులకు చేరువ చేసిన విషయం తెలిసింది. ఈ క్రమంలో గుండాల మండలాన్ని నీతి ఆయోగ్ యాస్పిరేషనల్ బ్లాకుగా ఎంపిక చేస్తూ అభివృద్ధి కొరకు కేంద్రం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా ప్రజలకు మరిన్ని సౌకర్యాలు సేవలు అందుబాటులోకి రానున్నాయి.. దీంతో గుండాల ప్రజల్లో ఆనందం వెలువెత్తనుంది.
నీతి ఆయోగ్ యాస్పిరేషనల్ బ్లాకుగా గుండాల: కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల
గుండాల మండలాన్ని నీతి ఆయోగ్ యాస్పిరేషనల్ బ్లాకుగా ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. బుధవారం ఐడిఓసి కార్యాలయపు మిని సమావేశపు హాలులో గుండాల మండలాన్ని యాస్పిరేషనల్ బ్లాకుగా ఎంపిక చేసిన సందర్భంగా ఢిల్లీ నుండి నీతి ఆయోగ్ సిఈఓ సుబ్రమణ్యం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్సు అనంతరం గుండాల మండల పంచాయతీరాజ్ వైద్య మహిళా
సంక్షేమ విద్యా డిఆర్డీఏ మిషన్ భగీరథ
సాంఘిక సంక్షేమ వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుండాల మండల అభివృద్ధి కొరకు నీతి ఆయోగ్ యాస్పిరేషన్ బ్లాక్ ఎంపిక చేసినందున సంబంధిత శాఖల అధికారులు పారామీటర్సు యొక్క ఇండికేటర్లును తయారు చేయాలని చెప్పారు.
మండల అభివృద్ధి కొరకు నీతి ఆయోగ్ నేరుగా ప్రధానమంత్రి ఆర్థిక సంగ నిధులు జిల్లా కలెక్టర్కు పంపనున్నట్లు చెప్పారు. ఆయా శాఖల అధికారులు శాఖల వారిగా చేపట్టాల్సిన 39 అంశాల పారామీటర్లుపై మూడు రోజుల్లో
నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గుండాల మండలంలోని 11 గ్రామ పంచాయతీలకు అంతర్జాల సేవలు
అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ నివేదికలు సిద్ధం చేయాలని చెప్పారు. ఆస్పిరేషన్ అంశాలపై వచ్చే వారంలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆయా శాఖల అధికారులకు కేటాయించిన విధంగా పారామీటర్లు ప్రతి నెలా 7వ తేదీ వరకు పరిశీలన చేసి జిల్లా అధికారులు అప్లోడ్ చేయాలని చెప్పారు. నివేదికలు
పంపుటలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యత్యాసం రాకుండా జిల్లా అధికారులు పర్యవేక్షణ చేయాలని చెప్పారు.
ఈ సమావేశంలో సిపిఓ శ్రీనివాసరావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, జిల్లా పంచాయతీ అధికారి రమాకాంత్, మహిళా శిశు సంక్షేమ అధికారి లెనీనా, ఏడిఏ లాల్చంద్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !