మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష హైదరాబాద్ ఆదేశాల మేరకు బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారిగా యం.వెంకటేశ్వర చారి నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ముందుగా మర్యాదపూర్వకంగా కలెక్టర్ ని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి విధుల్లోకి చేరారు.
ప్రస్తుతం ఖమ్మం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు జిల్లా విద్యాశాఖ అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి ఈ సోమశేఖర శర్మ, సూపరిండెంట్ జ్యోతి, సెక్టోరల్ అధికారులు ఏ.నాగరాజశేఖర్, ఎస్. కే. సైదులు, జె.అన్నామని, ఎన్.సతీష్ కుమార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.