మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు పట్టణం లోని సుందరయ్య నగర్ లోని బ్రైట్ మైండ్ ప్లే స్కూల్లో కృష్ణ జన్మాష్టమి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చిన్నారులు రాధాకృష్ణుని వేషాధరణతో అలరించారు.తల్లిదండ్రులు,తమ పిల్లలను గోపిక,కృష్ణుల వేషాలలో అలకంరించారు.చిన్నారుల వేషాధరణలు అందరిని ఆకట్టుకున్నాయి.అనంతరం ఏర్పాటు చేసిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో చిన్నారులు ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడే విధంగా చిన్నారులు కోలాటాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు,స్కూల్ కరెస్పాండెంట్ రాంబాబు,టీచర్లు పాల్గొన్నారు.