- గడప గడపకు కాంగ్రెస్
- ఇందిరమ్మ రాజ్యంతోనే పేదలకు సంక్షేమం
- పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మున్సిపాలిటీలో గడపగడపకూ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా మేదర్ బస్తీ, ఇందిరానగర్,పూల మార్కెట్,కాళీమాత ఏరియా,పైలట్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,అర్హులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి రావాలన్నారు.కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సహకారం అందించాలని ప్రజలను అభ్యర్థించారు.ఇంటింటికీ తిరుగుతూ, కరపత్రాలు అందజేసి వరంగల్ రైతు డిక్లరేషన్ తో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో మణుగూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినాకి నవీన్,వైస్ ఎంపీపీ కరివేద వెంకటేశ్వరరావు,ఉప సర్పంచులు పుచ్చకాయల శంకర్,వీరంకి వెంకట్రావు గౌడ్, ఎస్కె.బాజి,నాయకులు సామా శ్రీనివాసరెడ్డి,మాదాడి రాజేష్,కుంజా నాగేశ్వరరావు, తమ్మిశెట్టి సాంబ,కారం నాగేంద్రబాబు,మానస,ఆముదాల శ్యామల,ఉప్పడి అనిత,మౌనిక, గద్దల ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.