మన్యం న్యూస్ గుండాల: ప్రభుత్వ విప్ ,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గురువారం పర్యటనను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ గుండాల, ఆళ్లపల్లి మండలాల అధ్యక్షులు తెల్లం భాస్కర్, పాయం నరసింహారావు కోరారు. ఎమ్మెల్యే రేగా గురువారం రెండు మండలాల్లో పర్యటించనున్నందున బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పర్యటన విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు.
