50 కేజీల బియ్యం, 3 వేల నగదు అందజేత
మన్యం న్యూస్ గుండాల: గుండాల గ్రామపంచాయతీ వర్కర్ ఈసం గోపయ్య కుటుంబానికి గుండాల పోలీసులు అండగా నిలిచారు. సీఐ రవీందర్, ఎస్సై కిన్నెర రాజశేఖర్ 50 కేజీల బియ్యం, రూ3వేల నగదును అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉద్యోగ నిర్వహణలో పనిచేస్తుండగా ఈసం గోపయ్యదురదృష్టవశాత్తు మోటార్ సైకిల్ ప్రమాదం జరిగి చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమన్నారు.గోపయ్య కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు గురై బాధలలో ఉన్న గోపయ్య కుటుంబ పరిస్థితి తెలుసుకున్న గుండాల పోలీసులు తమ వంతుగా వితరణ అందజేసి మానవత్వం చాటుకున్నాడు.గతంలో సైతం మునుపు పూణెం రాములు కూడా రోడ్డు ప్రమాదం కు గురి అయ్యి కాలు విరగగా అతని ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోవటం రూ5వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో గుండాల ఉపసర్పంచ్ ఉపేందర్, ఆజాద్, నిట్ట అనిల్, పంచాయతీ వర్కర్స్ విజయరాజు , పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
