సింగరేణి కాంట్రాక్టు కార్మికుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి.
ఐఎఫ్ టియు జిల్లా అధ్యక్షులు ఆర్.మధుసూదన్ రెడ్డి
మన్యం న్యూస్ మణుగూరు:
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఐఎఫ్ టియు జిల్లా అధ్యక్షులు ఆర్.మధుసూదన్ రెడ్డి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను కోరారు.బుధవారం సింగరేణి సెక్యూరిటీ గార్డుల అడ్డా మీటింగ్ లో వారు పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆర్.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ,ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సింగరేణి సంస్థలో పర్మినెంట్ కార్మికులతో పాటు,52 డిపార్ట్మెంట్లలో సుమారు 25 వేలకు పైగా కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని,కొన్ని డిపార్ట్మెంట్లలో చట్టబద్ధ హక్కులు,సౌకర్యాలు నేటికి అమలు చేయడం లేదన్నారు.కాంట్రాక్టు కార్మికులకు కోల్ ఇండియాలో జరిగిన ఒప్పందాలను సైతం సింగరేణి యాజమాన్యం అమలు చేయడం లేదన్నారు.కోల్ ఇండియాలో అమలు చేస్తున్న హై పవర్ కమిటీ వేతనాలను సింగరేణిలో అమలు చేయాలని అనేక సంవత్సరాల తరబడి ఆందోళన చేస్తున్నసింగరేణి యాజమాన్యం, ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయన్నారు.గత సంవత్సరం ఆగస్టులో జరిగిన 18 రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు కూడా అమలుకు నోచుకోలేదన్నారు.ఈ స్థితిలో ఐఎఫ్ టియు అనుబంధ ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికులను పోరాట బాట పట్టించేందుకు గాను ఇల్లందులో సెప్టెంబర్ 10,2023 న రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నదని,అన్ని డిపార్ట్మెంట్ల కార్మికులు హాజరై రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని అని కోరారు.జీతభత్యాల పెంపు, చట్టబద్ధ హక్కుల అమలుకై మరో దఫా పోరాటానికి సిద్ధం కావాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక వర్గానికి ఆర్.మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సింగరేణి సెక్యూరిటీ గార్డులు తదితరులు పాల్గొన్నారు.