అర్హులైన పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వాలి
సీపీఎం నాయకులు మండా రాజన్న
మన్యం న్యూస్,బయ్యారం:రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన పేదప్రజలందరికి అందాలని మండల సిపిఎం నాయకులు మండా రాజన్న అన్నారు. బుధవారం పార్టీ శ్రేణులతో కలిసి రైతులందరికి రుణ మాఫీ చేసి కౌలు రైతులకు న్యాయం చెయ్యాలని డిమాండ్లతో స్థానిక తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు నంబూరి మధు తదితరులు పాల్గొన్నారు.