- పినపాక నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
- నియోజకవర్గ అభివృద్ధికి 41 కోట్ల 28 లక్షల నిధులు మంజూరు
- సీఎం కేసిఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు
- -తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతరావు
మన్యం న్యూస్ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గానికి జీవో నెంబర్ 242 ద్వారా రహదారుల అభివృద్ధి కోసం 41 కోట్ల 28 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ,గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం పట్ల ప్రభుత్వ విప్ రేగా కాంతారావు హర్ష వ్యక్తం చేస్తూ,నియోజకవర్గ ప్రజల పక్షాన సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా విప్ రేగా కాంతరావు మాట్లాడుతూ, పినపాక నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తూ,అభివృద్ధి కి సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృషి చేస్తున్నారు అన్నారు.సీఎం కేసిఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నట్లు విప్ రేగా తెలిపారు. గతంలో ఎవరు చేయని విధంగా ఏజెన్సీ ప్రాంతాలను కూడా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారు అని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని,జిల్లాలోనే నెంబర్ వన్ గా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతరావు తెలియజేశారు.