ములుగు జడ్పీ చైర్ పర్సన్,ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగ జ్యోతి.
మన్యం న్యూస్,ములుగు:
గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ అని ములుగు జడ్పీ చైర్ పర్సన్ బడే నాగ జ్యోతి అన్నారు.
గురువారం ఆమె గోవిందరావుపేట మండలంలోని బాలాజీ నగర్ గ్రామంలో
బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు గాంధీ ఆధ్వర్యంలో జరిగిన తీజ్ వేడుకలకు ఎంపీపీ సుడి శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు సురపనేని సాయి బాబుతో కలసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజన యువతులు చక్కటి వేషాధారణతో సాంప్రదాయ నృత్యాలతో అలంకరించారు.
9 రోజులపాటు భక్తిశ్రద్ధలతో గోధుమ మొలకలను పెంచి సాంప్రదాయబద్ధంగా దేవతలకు సమర్పించి నిమజ్జనం చేస్తారు.
ప్రపంచంలోనే ఏ తెగకు లేని ప్రత్యేకతలు బంజరా తెగకు ఉన్నాయి.
వారి భాష, వేషాధారణ,సంస్కృతి, సాంప్రదాయాలు,మరియు ఆచార వ్యవహారాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయని,తీజ్ పండుగను బంజారలు పవిత్రమైన భక్తిశ్రద్ధలతో 9రోజుకు జరుపుకోవడం గొప్ప విషయమని, తీజ్ పండుగను 100 సంవత్సరాల క్రితం ఏ ఆచారాల ప్రకారం పూర్వపు పండుగను చేశారో ఈరోజుల్లో కూడా అదే ఆచారాలను బంజారులు పాటిస్తున్నారన్నారు.
ఈ వేడుకలకు హాజరైన బాలాజీ నగర్, ప్రజలు బడే నాగజ్యోతిని తండా ప్రజలు ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి లకావత్ నర్సింహ నాయక్,
సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి,బాబర్ బంజారా సోదరులు, యువతి యువకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.∝