భారీ వర్షాల కారణంగా కోతకు గురైన చిరమళ్ల బ్రిడ్జిని పరిశీలించిన ప్రభుత్వ విప్ రేగా
మన్యం న్యూస్ కరకగూడెం: గత నెలలో వచ్చిన భారీ వర్షాల కారణంగా కరకగూడెం నుండి చిరుమళ్ళ వైపు వెళ్లే పెద్దవాగుపై నిర్మించిన బ్రిడ్జి చిరుమళ్ళ వైపు కోతకు గురి కావడంతో తోలత చిరుమళ్ళ,రాయనిపేట, కౌలురు,పోలకమ్మతోగు, అరెంవారిగుంపు,వట్టంవారిగుంపు ప్రజలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం గురువారం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే బ్రిడ్జి మరమ్మత్తులు చేపట్టి ప్రజలకు రవాణా సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తానని ఎవరు కూడా అధైర్య పడద్దని అండగా ఉంటానని తెలిపారు. అలాగే గతంలో ఏ పాలకులు పట్టించకపోవడంతో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొంది ఏళ్ల నాటి బ్రిడ్జ్ కలను సహకారం చేసింది నేనేనని గుర్తు చేశారు. అలాగే నేటి నుండి బ్రిడ్జి మరమ్మతులు చేపడతారని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు, కరకగూడెం సర్పంచ్ ఊకే.రామనాథం,చిరుమళ్ళ సర్పంచ్ పాయం.నరసింహారావు, మండల అధ్యక్షులు రావుల. సోమయ్య, సీనియర్ నాయకులు రేగా.సత్యనారాయణ, వట్టం.సురేందర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అక్కిరెడ్డి వెంకటరెడ్డి యువజన నాయకులు కటకం.లేలిన్,దిలీప్,పూనెం.బిక్షపతి బిఆర్ఎస్ పార్టీ నాయకులు,ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.
