మన్యం న్యూస్ ,మంగపేట:
మంగపేట మండలం రాజుపేట వేణుగోపాలస్వామి ఆలయం లో,కమలాపురం గ్రామం రామాలయం లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక రామాలయం దేవాలయం లో చిన్నారులు సత్యభామ, గోపిక ,కృష్ణుడు వేషంలో అలరించారు.ఈ సందర్భంగా చిన్నారులు, కృష్ణుడి వేష ధారణ లో, మరి కొందరు గోపికలు గా పలు వేషధారణలో ఆలయం లో నృత్య ప్రదర్శన లు చేయడం జరిగింది.
