మన్యం న్యూస్,ఇల్లందు:కృష్ణాష్టమి సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని 9, 10వ వార్డు శ్రీకృష్ణకమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కాకతీయ నగర్ తెలంగాణ క్రీడ ప్రాంగణం లో ఉట్టికొట్టు కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇల్లందు పురపాలక ఛైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించగా పిల్లలు, యువకులు, మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఆటపాటల మధ్య ఆనందోత్సవంలో ఉట్టి కార్యక్రమము ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు అంకెపాక నవీన్ కుమార్, ఎలమందల వీణ వాసు, మొగిలి లక్ష్మీ, వారారవి, బారాస ఇల్లందు పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వర్లు, నాయకులు కృష్ణారావు, యాదవ సంఘం నాయకులు కరెంటు శీను, మురళి, యాదగిరి, బీఆర్ఎస్ ఇల్లందు పట్టణ యువజన అధ్యక్షులు మెరుగు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.