పల్లికొండ యాదగిరి
మన్యం న్యూస్,మంగపేట: గ్రామాలలో తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ మాల మహా నాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లి కొండ యాదగిరిఅన్నారు. మండలం లోని గ్రామాలలో ఏజెన్సీ పల్లెలో ఇంటికి ఒకరు, ఇద్దరు చొప్పున విష జ్వరాలు ,డెంగీ మలేరియా బారినపడి ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూ తిరుగతూ అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకు డెంగీ, మలేరియా,విష జ్వరాలు పెరిగి పోతున్న వైద్య అధికారులు మాత్రం నోరు మెదపపకుండా చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
