మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
సంక్షేమ రథసారథి సీఎం కేసీఆర్ అని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని
19, 20, 21, 22, 32 వార్డుల్లో గురువారం ఎమ్మెల్యే వనమా విస్తృతంగా పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 14 కోట్ల రూపాయలతో వార్డులను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. వార్డులలో సిసి రోడ్లు డ్రైనేజీలు మౌలిక సదుపాయాలు కల్పించడం లక్ష్యంగా ముందుకు పోతున్నట్లు పేర్కొన్నారు. కొత్తగూడెం అభివృద్ధికి కేసీఆర్ పుష్కలంగా నిధులు ఇచ్చారని అట్టి నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి పనులు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రఘు, వార్డు కౌన్సిలర్లు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వనమా అభిమానులు పాల్గొన్నారు.