మన్యం న్యూస్ కొత్తగూడెం టౌన్: జర్నలిస్టు డే ను పురస్కరించుకొని కొత్తగూడెంలో పద్మశాలి సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఐజేయు నేత
ఇమంది ఉదయ్ కుమార్ కు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా పద్మశాలి నాయకులు మాట్లాడుతూ జర్నలిజంలో అంచలంచెలుగా సామాన్య రిపోర్టర్ గా ప్రస్థానం ప్రారంభించి, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికలలో విజయం సాధించారని అన్నారు. ప్రస్తుతం ఉదయం తెలుగు దినపత్రికను స్థాపించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నిర్వహిస్తున్నందుకు అభినందించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘ నాయకులు వంగర సీతారాం, తుమ్మ రమేష్, జాగీరపు మల్లేష్, బిర్రు నరసింహారావు, రాయలింగు, వెంగళ కనకయ్య తదితరులు పాల్గొన్నారు.