మన్యం న్యూస్ మణుగూరు:
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మణుగూరు మండల వ్యాప్తం గా బుధవారం ఘనంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు.మండలం లోని రామానుజవరం,సాంబాయి గూడెం,పాత మణుగూరు, శ్రీకృష్ణా ఆలయాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ వేడుకలలో భాగంగా చిన్నారులు కృష్ణుని,గోపిక వేషధారణలో అలరించారు. సాయంత్రం ఉట్టికొట్టే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మణుగూరు మండల అధ్యక్షులు మారుతి శ్రీనివాస్ యాదవ్,గోకుల కృష్ణ సేవా సమితి అధ్యక్షులు మేకల లింగయ్య యాదవ్,ఆర్గనైసింగ్ సెక్రటరీ మంగి మల్లికార్జున్ యాదవ్,కార్యవర్గ సభ్యులు యాదవ్ గ్రామాల పెద్దలు నోముల రవి యాదవ్,జక్కుల రామలింగ యాదవ్,పులిగిల్ల రమేష్ యాదవ్,తోడేటి కుమారస్వామి యాదవ్,స్థానిక ప్రజలు,యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.