UPDATES  

 సింగరేణి సంస్థను బ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వం

* కార్మికుల కష్టార్జితాన్ని ప్రభుత్వానికి దోచిపెట్టేందుకే ఎరియర్స్ జాప్యం
* 23నెలల 11వ వేజ్ బోర్డు బకాయి వేతనాలు ఒకే దఫా చెల్లించాలి
* సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా
* ఏఐటియుసి ఆధ్వర్యంలో సింగరేణి హెక్టాఫీస్ ఎదుట దీక్ష చేపట్టిన కార్మికులు

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
సింగరేణి సంస్థను తెలంగాణ ప్రభుత్వం బ్రష్టు పట్టిస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్న సింగరేణి యాజమాన్యం కార్మికుల కష్టార్జితాన్ని దోచిపెట్టి మెప్పు పొందేందుకే కార్మికులకు రావాల్సిన వేజ్ బోర్డు ఏరియర్స్ చెల్లింపులో జాప్యం చేస్తోందని సిపిఐ భద్రాది జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా ఆరోపించారు. 23 నెలలకు సంబంధించి 11వ వేజ్ బోర్డులో పెరిగిన వేతనాలు ఒకే దఫా చెల్లించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) ఆధ్వర్యంలో గురువారం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టారు. దీక్షలను ప్రారంభించిన అనంతరం సాబీర్ పాషా మాట్లాడుతూ సిఎస్ఆర్, డిఫిర్ ట్యాక్సు, ఎమ్మెల్యేలకు ప్రత్యే నిధుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి ఖజానాకు గండి కోడుతోందని దీనికి సింగరేణి యాజమాన్యం, సర్కారు సంఘం టిబిజికెఎస్ సహకరిస్తూ సంస్థను దివాలా తీయిస్తున్నారని అన్నారు. విద్యుత్ సంస్థలకు సంబందించి సింగరేణి సంస్థకు ప్రభుత్వం చెల్లించాల్సిన కోట్లాది రూపాయల బకాయిలు చెల్లింపులో మీనమేశాలు లెక్కిస్తోందని విమర్శించారు. మితిమీరిన రాజకీయ జోక్యంతో కర్రపెత్తనంతో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థను దోచుకుంటోందని విమర్శించారు. కార్మికులకు స్వంతిటి పథకం, కారుణ్య నియామకాలు, నూతన భూగర్భగనులు, అలియాస్ పేర్ల మార్పు వంటి అనేక హామీలు విస్మరించి కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోని కేసీఆర్కు సంస్థపై పెత్తనం చెలాయంచే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. పైరవీలకే పరిమితమైన టిబిజికెఎస్ కార్మికుల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని అందుకే గుర్తింపు సంఘం ఎన్నికలంటే కేసీఆర్కు బయం పట్టుకుందని, సర్కారు సంఘం కాలపరిమితి తీరిపోయినప్పటికి ఓటమి భయంతోనే ఎన్నికలు నిర్వహించేందుకు మోకాలడ్డుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి హామీలు అమలు చేయాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు దమ్మాలపాటి శేషయ్య, వంగా వెంకట్, గనిగళ్ళ వీరస్వామి, కొత్తగూడెం, కార్పోరేట్ బ్రాంచి కార్యదర్శులు వి.మల్లికార్జున్రావు, ఎస్. రమణమూర్తి, జె. గట్టయ్య, ఉమాయున్, సందేబోయిన శ్రీనివాస్, గుమ్మడి వీరయ్య, తిరుపతి, ఏసుపాదం, అనంతలక్ష్మి, కిష్టాఫర్, రాము, నాగయ్య, సుబ్బారావు, కొవ్వూరి రాజేశ్వర్రావు, జడల ప్రకాష్ తదితరులు దీక్షలో పాల్గొనగా, సిపిఐ నాయకులు వై శ్రీనివాస రెడ్డి, వాసిరెడ్డి మురళి, మాచర్ల శ్రీనివాస్, నూనావత్ గోవిందు తదితరులు శిభిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !